Sunday, January 19, 2025

గుడిలో మహిళపై తొమ్మిది మంది అత్యాచారం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: అస్సాలోని గౌహతి ప్రాంతంలో దారుణంలో వెలుగులోకి వచ్చింది. బోరాగఢ్‌లో ఓ మహిళపై తొమ్మిది మంది సామూహిక అత్యాచారం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వాట్సప్ గ్రూపులలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి తొమ్మిది మంది అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవంబర్ 17న నిజారాపార్ ప్రాంతంలోని దుర్గ గుడి సమీపంలో మహిళపై తొమ్మిది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 12న వాట్సాప్ గ్రూపులలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు కుల్దీప్ నాథ్(23), బిజయ్ రాభా(22), పింకుదాస్(18), గగన్ దాస్(21), సౌరవ్ బోరో(20), మ్రినాల్ రాభా(19) ఆరుగురిని అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News