Sunday, December 22, 2024

మహిళా జిమ్ ట్రైనర్‌ను కత్తితో పొడిచి చంపిన బాయ్ ఫ్రెండ్

- Advertisement -
- Advertisement -

న్యూడిల్లీ: మహిళా జిమ్ ట్రైనర్‌ను బాయ్ ఫ్రెండ్ హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని ద్వారకా నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. అస్సాంకు చెందిన స్నేహ నాథ్ పోచాన్‌పూర్ కాలనీలో నివసిస్తున్నారు. అస్సాంకు చెందిన దేవరాజ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఉంది. స్నేహ నివసిస్తున్న ప్లాట్‌లో ఆమెను దేవ రాజ్ కత్తితో పలుమార్లు పొడిచాడు. ఆమె రక్తపు మడుగులో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దేవరాజ్ చేతులపై గాయాలు ఉండడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు సహజీవనం చేస్తున్నారని స్థానికులు ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News