Saturday, January 25, 2025

అసోంలో భూకంపం…రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రత నమోదు

- Advertisement -
- Advertisement -

గౌహతి: అసోంలో భూప్రకంపనలు సంభవించాయి. ఉత్తర-మధ్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. బ్రహ్మపుత్ర ఉత్తర ఒడ్డున ఉన్న ఉదల్ గురి జిల్లాలో ఉదయం 7:47 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపం 15 కిమీ. లోతులో నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది.

ఇక భూకంప కేంద్రం నిర్దిష్ట స్థానం గౌహతికి ఉత్తరాన 105 కిమీ. , అసోం- అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని తేజ్ పూర్ కు పశ్చిమాన 48 కిమీ. దూరంలో ఏర్పడింది. కాగా పొరుగున ఉన్న దర్రాంగ్, తమూల్పూర్, సోనిత్ పూర్, కామ్రూప్, బిశ్వనాథ్ జిల్లాల్లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈశాన్య ప్రాంతం భూకంప జోన్ లో ఉండడం వల్ల తరచూ ఈ ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకుంటుంటాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News