Thursday, January 23, 2025

ఐసియులో భార్య మృతదేహం వద్దనే ఐపిఎస్ బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

గువహటి : అస్సాం హోం శాఖ కార్యదర్శిగా పనిచేసే శిలాదిత్య చెతియా తన భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె మృతదేహం ఉన్న ఐసీయు లోనే తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. అస్సాం లోని గువహటికి చెందిన ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఈ విషాదకర సంఘటన జరిగింది. తీన్‌సుకియా, సోనిత్‌పుర్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన శిలాదిత్య, అస్సాం పోలీస్ విభాగానికి చెందిన ఫోర్త్ బెటాలియన్‌కు కమాండెంట్‌గా విధులు నిర్వర్తించారు.

ఆ తరువాత హోం శాఖ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 2009 బ్యాచ్‌కు చెందిన శిలాదిత్య భార్య కొద్ది కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గువాహటిలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమెను దగ్గరుండి చూసుకోడానికి నాలుగు నెలలుగా శిలాదిత్య సెలవు లోనే ఉన్నారు. మంగళవారం ఆమె ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోవడంతో తట్టుకోలేక ఐసీయు వద్దనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనకు అస్సాం పోలీస్ కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిందని డిజిపి జిపి సింగ్ ఎక్స్ పోస్ట్‌లో సంతాపం వెలిబుచ్చారు. చెతియాకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఆయన తల్లి, అత్తగారు కొన్ని నెలల్లోనే చనిపోయారు. శిలాదిత్య తండ్రి కూడా పోలీస్ ఆఫీసరే. శిలాదిత్యకు సంతానం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News