Friday, January 24, 2025

మర్మాంగాల్లోకి గాలి కొట్టాడు… స్నేహితుడి ప్రాణం తీసిన సరదా…

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: సరదా కోసం స్నేహితుడి మర్మాంగాల్లోకి గాలి కొట్టడంతో అతడు మృతి చెందిన సంఘటన కేరళ రాష్ట్రంలోని పుల్లవాజిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మింటూ, సిద్దార్థ్ చామౌ అనే అస్సాలోని లకిమ్ పూర్ కు చెందిన యువకులు బతుకుదెరువు కోసం కేరళకు వచ్చారు. వీరిద్దరూ స్నేహితులు కావడంతో సరదాగా ఉంటున్నారు. సరదా కోసం మింటూ ప్రైవేటు భాగాల్లోకి కంప్రెషర్ పంపును జొప్పించి గాలి కొట్టడంతో అతడి కడుపు ఉబ్బిపోయింది. మింటూ స్పృహతప్పి పడిపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మింటూ చనిపోయాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి సిద్ధార్థ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే చేశానని ఒప్పుకున్నాడు. సరదా కోసం చేసిన పని స్నేహితుడి ప్రాణాలు తీయడంతో పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

Also Read: అతడికే చికిత్స అందిస్తుండగా వైద్యురాలిని పొడిచి చంపిన ఉపాధ్యాయుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News