Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో లేడీ సింగం మృతి

- Advertisement -
- Advertisement -

 

దిస్‌పూర్: అస్సాం రాష్ట్రం నాగాన్ జిల్లా జాఖలాబంధా పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిభర్ సబ్ డివిజన్ లో సోమవారం రాత్రి లేడీ సింగం జున్‌మోనీ కారును కంటైనర్ ఢీకొనడంతో ఆమె దుర్మరణం చెందింది. ఎస్‌ఐ జున్‌మోనీ తన కారులో ప్రయాణిస్తుండగా సుభుగియా గ్రామ శివారులో ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొనడంతో ఆమె ఘటనా స్థలంలో చనిపోయింది. సివిల్ దస్తుల్లో ఉన్న ఆమె ఎక్కడికి వెళ్తున్న విషయం తెలియదని జిల్లా ఎస్‌పి వెల్లడించారు. మహిళా ఎస్‌ఐ జున్‌మోనీ రాభా విధుల్లో ఉన్నప్పుడు కఠినంగా వ్యవహరించేడంతో లేడీ సింగంగా పేరు తెచ్చుకుంది. ఆమె పలు వివాదాల్లో చిక్కుకపోవడంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో సస్పెండ్ అయ్యారు. బిజెపి ఎంఎల్‌ఎతో కలిసి పోన్‌లో మాట్లాడిన సంభాషణ కూడా వివాదాస్పదంగా మారింది. ప్లాన్ ప్రకారం తన కూతురును రోడ్డు ప్రమాదంలో చంపేశారని ఆమె తల్లి సుమిత్రా రభా ఆరోపణలు చేసింది. ఈ ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని విచారణ చేయాలని అస్సా ముఖ్యమంత్రి హిమంతా బిశ్వాను జుమోనీ అత్తమ్మ డిమాండ్ చేశారు.

Also Read: క్యాన్సర్ రోగికి బాసటగా(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News