Friday, December 20, 2024

తొలి దశ పోలింగ్ బరిలో రైతులు, గృహిణులు

- Advertisement -
- Advertisement -

అస్సాంలోని ఐదు నియోజకవర్గాలలో ఈ నెల 19న జరగనున్న తొలి దశ ఎన్నికలలో బరిలో ఉన్న అభ్యర్థులలో సాగుదారులు, వాణిజ్యవేత్తలు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, గృహిణులు, పూర్తి స్థాయి రాజకీయ నాయకులు ఉన్నారు. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం, వారిలో ప్రస్తుత బిజెపి ఎంపిలు తపన్ గొగోయ్, ప్రదాన్ బారువాతో సహా ఎనిమిది మంది అభ్యర్థులు సాగుదారులు. వారు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పాల్గొంటున్నారు కూడా. అస్సాం జాతీయ పరిషత్ అధ్యక్షుడు, దిబ్రూగఢ్ నియోజకవర్గంలో ప్రతిపక్ష అభ్యరిథ లురిన్‌జ్యోతి గొగోయ్ రైతు అని, ఆయనకు వ్యవసాయం ద్వారా ఆదాయం వస్తుందని ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ వల్ల తెలుస్తోంది.

కేంద్ర మంత్రి, బిజెపి దిబ్రూగఢ్ అభ్యర్థి సర్బానంద్ సోనోవాల్, బిజెపి కజిరంగ అభ్యర్థి కామాఖ్య ప్రసాద్ తసా, కాంగ్రెస్ జోర్హట్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ తాము రాజకీయ నాయకులమని, ఎంపిలుగా వేతనం అందుకుంటున్నామని తెలియజేశారు. బిజెపి సోనిత్‌పూర్ అభ్యర్థి, ఎంఎల్‌ఎ రంజిత్ దత్తా కూడా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు. అయితే, ఆయన కుటుంబ సభ్యులు ఫ్యుయెల్ సర్వీస్ స్టేషన్, టీ గార్డెన్, ఇటుకల పరిశ్రమతో సహా వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కజిరంగ అభ్యర్థి రోజెలీనా తిర్కీ కూడా పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలు. కాగా, మొదటి దశలో పోటీ చేస్తున్న విశ్రాంత వ్యక్తులలో మాజీ ప్రభుత్వ ఇంజనీర్, బీమా అధికారి, ఒక ప్రైవేట్ సంస్థ కార్మికుడు కూడా ఉన్నారు. తొలి దశ ఎన్నికలలో బరిలో ఉన్న నలుగురు మహిళా అభ్యర్థులలో ఇద్దరు గృహిణులు, ఒక పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలు, ఒక వాణిజ్యవేత్త ఉన్నారు. కజిరంగ పార్లమెంటరీ నియోజకవర్గంలలో అత్యధికంగా మహిళా అభ్యర్థులు ఉన్నారు.

తిర్కీ కాంగ్రెస్ అభ్యర్థి కాగా, వోటర్స్ ఇంటర్నేషనల్ పార్టీ (విఐపి)కి చెందిన అనిమా డెకా గుప్తా ఒక గృహిణి, ఇండిపెండెంట్ దిలువారా బేగమ్ చౌధురి ఒక ప్రముఖ ఆయిల్ పిఎస్‌యు డీలర్‌షిప్ ఉన్న వాణిజ్యవేత్త. మరొక మహిళా అభ్యర్థి రింకూ రాయ్ సోనిత్‌పూర్ నుంచి పోటీ చేస్తుండగా, మొదటి దశ పోలింగ్ జరగనున్న మరి మూడు నియోజకవర్గాలలో మహిళా అభ్యర్థులు ఎవరూ లేరు. కజిరంగ నుంచి పోటీ చేస్తున్న ఆర్‌పిఐ అభ్యరిత సాలెహ్ అహ్మద్ మజుందార్ ఒక ప్రైవేట్ ట్యూటర్‌గా పని చేస్తుండగా, మరొక అభ్యర్థి ఎస్‌యుసిఐ (కమ్యూనిస్ట్)కు చెందిన లఖింపూర్ అభ్యర్థి పల్లబ్ పాల్ పెగు తన వృత్తిని గానీ, ఆదాయ వనరును గానీ ప్రకటించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News