Wednesday, January 22, 2025

అసోం, మేఘాలయ సరిహద్దు వివాదానికి తెర

- Advertisement -
- Advertisement -

Assam Meghalaya border dispute

గువాహటి : అసోం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి తెర పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఓ చారిత్రక ఒప్పందం కుదిరింది. అసోం సీఎం హిమంత విశ్వశర్మ, మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా మంగళవారం కేంద్ర హోం మంత్రి సమక్షంలో ఈ చారిత్రక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు సమస్యకు స్వస్తి పలకడానికి ఓ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించారు. ఈ సరిహద్దు వివాదంలో మొత్తం 12 అంశాలపై గొడవలుండగా, 6 అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంలు అంగీకారానికి వచ్చారని, సంతకాలు కూడా చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వివరించారు. దాదాపు 70 శాతం సమస్య పరిష్కారమైందని, ఇక మిగతా 6 అంశాలపై కూడా త్వరలోనే ఓ అంగీకారం కుదురుతుందని ప్రకటించారు. ప్రస్తుతం మొదటి దశ తీర్మానాలు జరిగాయని, మిగిలిన వివాదాలను త్వరలోనే పరిష్కరించుకుంటామని అసోం సీఎం హిమంత విశ్వశర్మ, మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా తెలిపారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో తగిన సూచనలిచ్చిన కేంద్ర మంత్రి అమిత్‌షాకు వారు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News