Friday, November 15, 2024

మోడీపై ట్వీట్ చేసినందుకు గుజరాత్ ఎంఎల్ఏ జిగ్నేష్ మేవానీ అరెస్ట్ 

- Advertisement -
- Advertisement -

Gujarat MLA Jignesh Mevani

 

గాంధీనగర్(గుజరాత్): ప్రధాని నరేంద్ర  మోడీ ‘గాడ్సేను దేవుడిగా భావిస్తున్నాడు’ అంటూ పోస్ట్ పెట్టినందుకు గుజరాత్ కు చెందిన ఇండిపెండెంట్ ఎంఎల్ఏ జిగ్నేష్ మెవానీని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు.  మోడీ పశ్చిమ రాష్ట్ర పర్యటన సందర్భంగా మత సామరస్యం కోసం విజ్ఞప్తి చేయాలని మెవానీ అదే ట్వీట్‌ను ఉపయోగించారని, కోక్రాజార్ పోలీస్ స్టేషన్‌లోని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారని  పిటిఐ వెల్లడించింది.

 గుజరాత్‌ నుంచి గౌహతికి ఆయన్ను విమానంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తీసుకెళ్లి, ఆ తర్వాత రోడ్డు మార్గంలో కొక్రజర్కు  తీసుకెళ్లారు. కోక్రాజర్‌లో  ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలు చేసిన తర్వాత బుధవారం రాత్రి గుజరాత్‌లోని పాలన్‌పూర్ పట్టణంలో ఆ ప్రముఖ దళిత నాయకుడిని పట్టుకున్నారు.

బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్‌కు చెందిన బిజెపి ఎగ్జిక్యూటివ్ సభ్యుడు అరుప్ క్రేడే మంగళవారం ఫిర్యాదు చేశారు.ట్వీట్ యొక్క సర్క్యులేషన్ “విస్తారమైన విమర్శలకు కారణమైంది, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే ప్రవృత్తిని కలిగి ఉంది, ఒక నిర్దిష్ట వర్గం ప్రజల మధ్య సామరస్యాన్ని భంగం కలిగించేదిగా ఉంది” అని డే తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించేందుకు ఇలాంటి సున్నితమైన అంశాలను పెట్టుబడిగా పెట్టేందుకు కొన్ని అదృశ్య చేతులు ఉండి ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. “చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా” ట్విట్టర్ ఆ పోస్ట్ ను  నిలిపేసింది.

మేవానీ బనస్కాంతలోని వడ్గాం స్థానంకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే. తాజాగా ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఇదిలావుండగా ఈ అరెస్టును కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ “అప్రజాస్వామికమైనది”, “రాజ్యాంగ విరుద్ధం” అని పేర్కొన్నారు. ఇది తనను ప్రజా ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజలను అవమానించడమేనని గాంధీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News