గువాహటి: దర్రంగ్ జిల్లాలోని ఒక పాఠశాలలో ఆయుధాల శిక్షణా శిబిరాన్ని నిర్వహించినందుకు బజరంగ్ దళ్ కార్యకర్తలపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు.మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష పేరిట వివిధ వర్గాల ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచుతూ మతసామరస్యాన్ని దెబ్బతీసే కార్యకలాపాలకు పాల్పడినందుకు ఐపిసిలోని 153ఎ/34 సెక్షన్ల కింద మంగల్‌దాయ్ పోలీసు స్టేషన్‌లో బజరంగ్ దళ్ కార్యకర్తలపై కేసు నమోదైంది.
మంగల్‌దాయిలోని మహర్షి విద్యా మందిర్ వద్ద రాష్ట్రీయ బజరంగ్ దళ్ నిర్వహించిన శిక్షణకు సంబంధించిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు దర్రంగ్ పోలీసులు తెలిపారు. వైరల్‌గా మారిన వీడియోలో ఆయుధాల శిక్షణా శిబిరాన్ని బరంగ్ దళ్ కార్యకర్తలు నిర్వహించడం కనిపించింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం డిజిపి జిపి సింగ్ దర్రంగ్ జిల్లా ఎస్‌పిని అదేశించారు.
Rashtriya Bajrang Dal gives firearms training to 350 Hindu youths to fight “love jihad” in Assam. pic.twitter.com/OzSlhjfWct
— HindutvaWatch (@HindutvaWatchIn) July 31, 2023