Friday, December 27, 2024

కేవలం రూ.8 ఖర్చు.. 30కిమీ ప్రయాణం.. అస్సాం యువకుడి వండర్ బైక్..

- Advertisement -
- Advertisement -

కేవలం ఎనిమిది రూపాల ఖర్చుతో 30కిలో మీటర్లు ప్రయాణించే ఈ బైక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అస్సాంలోని తేజ్‌పూర్‌ బరికాసుబురి ప్రాంతానికి చెందిన మస్కుల్ ఖాన్ అనే విద్యార్థి.. ఈ విద్యుత్ బైక్ ను రూపొందించాడు. దీనికి ‘వండర్ బైక్ 250’ అని పేరు కూడా పెట్టాడు. కేవలం రూ.8 ఖర్చుతో ఈ ప్రత్యేక బైక్ 30 కిలో మీటర్లు సులభంగా ప్రయాణించగలదని మస్కుల్ ఖాన్ చెప్పాడు.

కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో కూర్చొని మొదట ఇ-సైకిల్‌ను తయారు చేశాడు. అదే స్ఫూర్తితో వినూత్న ఆలోచనతో మరింత అప్‌గ్రేడ్ చేసి ఈ బైక్ ను రూపొందించాడు. భవిష్యత్ లో ఈ కార్ ను కూడా రూపొందిస్తానని ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రత్యేక బ్యటరీతో నడిచే ఈ బైక్ 30కిలోల బరువు ఉంటుందని.. దాదాపు 100 కిలోల బరువును ఇది మోయగలదని ఖాన్ తెలిపాడు. ఈ బ్యాటరీ ఐదు గంటల్లో చార్జ్ అవుతుందని చెప్పాడు. అందరీ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బైక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News