Monday, December 23, 2024

భర్త, అత్తను చంపి…. ముక్కలుగా నరికి…. లోయలో పడేసిన భార్య

- Advertisement -
- Advertisement -

 

గువాహటి: తన ప్రియుడు, మరోచిన్ననాటి స్నేహితుడితో కలసి తన భర్తను, అత్తను హతమార్చిన ఒక భార్య శవాలను ముక్కలుగా నరికి, వాటిని ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసి, ఆ సంచులను మేఘాలయాలోని లోయలలో పడవేసింది. అత్యంత దారుణమైన ఈ సంఘటన అస్సాంలో గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. సుమారు ఏడు నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఇటీవలే వెలుగుచూసిందని, నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసి విచారిస్తున్నామని గువాహటి పోలీసు కమిషనర్ దిగంత బరాహ్ తెలిపారు. తన భర్త, అత్త కనపడడం లేదంటూ ఒక మహిళ గత ఏడాది సెప్టెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.

ఆమె భర్తను ధర్మేంద్ర దే, అత్తను శంకరి దేగా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే అమరేంద్ర దే బంధువు ఒకరు కూడా వీరిద్దరి అదృశ్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు అతని భార్యపై అనుమానం ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. రెండు వేర్వేరు చోట్ల భర్తను, అత్తను చంపిన ఆ భార్య తన ప్రియుడు, బాల్య స్నేహితుడి సాయంతో ఆ శవాలను ముక్కలుగా నరికి, వాటిని ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసి పొరుగున ఉన్న మేఘాలయాకు వెళ్లారని, అక్కడ కొండల పైనుంచి లోయలో వాటిని పడేశారని కమిషనర్ తెలిపారు. మేఘాలయాలో శంకరి మృతదేహంలోని కొన్ని భాగాలు ఆదివారం లభించాయని ఆయన చెప్పారు. రెండు మృతదేహాలకు చెందిన ఇతర భాగాల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News