Saturday, January 25, 2025

అస్సాంలో దుర్భరంగా ఉన్న వరద పరిస్థితి

- Advertisement -
- Advertisement -

4 లక్షల మంది ప్రభావితం

గువాహతి: అస్సాంలో శుక్రవారం కూడా వరద పరిస్థితి దుర్భరంగా ఉంది. అనేక జిల్లాల్లో ప్రజలు ఇంకా నీళ్ల మధ్యే ఉన్నారని అధికారులు తెలిపారు. కొపిలి, బరాక్, కుషియార సహా అనేక నదులు గురువారం సాయంత్రం నుంచి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.

అస్సాంలోని 19 జిల్లాల్లో- అంటే, బజాలీ, బక్సా, బార్ పేట, బిశ్వనాథ్, కచర్, దర్రంగ్, గోల్పాడ, హైలాకండి, హోజాయ్, కామ్ రూప్, కరీంగంజ్, కొక్రాజర్, లక్ష్మీపూర్, నాగోవ్, నల్బరీ, సోనిత్ పూర్, దక్షిణ సల్మరా, తముల్ పూర్, ఉదల్ గురి..  4లక్షల మంది వరద నీటిలోనే బతుకీడుస్తున్నారు.  గత కొన్ని రోజులుగా అస్సాంలో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News