Monday, January 20, 2025

లైన్ మెన్ పై హత్యాయత్నం..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: లైన్ మెన్ పై హత్యాయత్నం చోటు చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్నాపూర్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ప్రజ్నాపూర్ లో బిల్లు కట్టలేదని కరుణాకర్ అనే వ్యక్తి ఇంటికి విద్యుత్తు సరఫరా నిలిపివేశాడు. విద్యుత్తు నిలిపివేయడంతో ఆగ్రహానికి లోనైనా కరుణాకర్ లైన్ మెన్ పై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించాడు.నిప్పంటిస్తుండగా కరుణాకర్ భార్య అడ్డుకుంది. దీంతో బాధితుడు గజ్వేల్ పోలీసులకు కరుణాకర్ పై ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కరుణాకర్ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News