- Advertisement -
పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ :హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మొయిజ్‌ను తన అధికారిక నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దుండగులు ఇంట్లోకి చొరబడి అధ్యక్షుడితోపాటు ఆయన భార్యపై తుపాకీ కాల్పులు జరిపారు. ఈ దాడిలో అధ్యక్షుడు మృతి చెందగా, భార్య మార్టిన్ మోసీ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంగ్లీష్, స్పానిష్ మాట్లాడే వ్యక్తులు ఇంట్లోకి చొరబడి హత్యకు పాల్పడ్డారని ప్రధాని జోసఫ్ చెప్పారు. ప్రజలంతా సంయమనం పాటించాలని జోసఫ్ విజ్ఞప్తి చేశారు. 2018నుంచి హైతీ దేశాధ్యక్షుడుగా మొయిజ్ కొనసాగుతున్నారు. అధ్యక్షుడి హత్యతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగే అవరాశం ఉన్నట్టు ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది.
- Advertisement -