Friday, December 27, 2024

గుజరాత్‌గిరి.. బ్యాంకు ఉద్యోగిపై దాడి

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : పలు మోడీ ఆదర్శాల గాంధీ గుజరాత్‌లో గూండాగిరి జరిగింది. పట్టపగలు కొందరు ఖాతాదారులు రాష్ట్రంలోని నదియాద్ శాఖ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపలికి ప్రవేశించి బ్యాంకు ఉద్యోగిపై దాడికి దిగారు. చితకబాదారు. బ్యాంకు రుణానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు లోపలికి ఉన్నట్లుండి ప్రవేశించారు. లోపల కూర్చున్న రుణవితరణ అధికారి వద్దకు దూసుకువెళ్లారు. ఓ వ్యక్తి ఆయనను పట్టుకుని కొట్టారు. ఈ సమయంలో బ్యాంకులోపల కొందరు కస్టమర్లు , సిబ్బంది కూడా ఉన్నారు. ఉద్యోగిని కొడుతున్న వ్యక్తిని ఆపేందుకు కొందరు యత్నించారు.

కానీ లాభం లేకుండా పోయింది. ఉద్యోగిని కొట్టిన తరువాత అక్కడి నుంచి కదిలిన ఇద్దరిని తరువాత బ్యాంకు భద్రతా సిబ్బంది అటకాయించి అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించింది. దౌర్జన్యానికి దిగిన వారు బ్యాంకు ఉద్యోగిని కొట్టడంతో పాటు కులం పేరిట బూతుల తిట్లు కూడా ప్రయోగించారు. బ్యాంకు అధికారి వెంటనే ఘటనపై స్పందించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం పరిధిలో ఫిర్యాదు చేశారు. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ దౌర్జన్య ఘటన గురించి వీడియో ఫుటేజ్‌లు ఇప్పుడు సంచలనానికి దారితీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News