తొలిరోజు మరణించిన సభ్యులకు సంతాపం..
ఆ తర్వాత ఉభయ సభల బిఎసి సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి శాసనసభ, శాసన మండలి స మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సమావేశాలు మొదలుకానున్నాయి. సమావే శం ప్రారంభంకాగానే మరణించిన స భ్యులకు ఉభయ సభలు సంతాపం ప్ర కటించనున్నాయి. అనంతరం సభలు వాయిదాపడనున్నాయి. అనంతరం ఉ భయ సభలు నిర్వహించే బిఎసి సమావేశంలో అసెంబ్లీ, మండలి సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశాన్ని ఖరారు చేస్తారు. అలాగే సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై కూడా బిఎసి సమావేశాల్లో నిర్ణయిస్తారు. కాగా మునుగోడు ఉ ప ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సమావేశాల్లో రా ష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశాలు తెలుస్తోం ది. అలాగే రైతుల సమస్యలు, అధిక వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం, పోడు భూములు, కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక కొన్ని బిల్లులను కూడా ఈ స మావేశాల్లో ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది.