Monday, December 23, 2024

ఆర్ టిసి విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  టిఎస్ ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై సందిగ్ధత వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమ్మతించారు. బిల్లుపై తొలుత గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు. దీంతో సభలో ప్రవేశపెట్టడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్ర మంలో రవాణాశాఖ అధికారులతో రాజ్‌భవన్‌లో తమిళిసై ఆదివారం సమావేశమయ్యారు. గవర్నర్ లేవనెత్తిన సందేహాలపై రవాణశాఖ, ఆర్‌టిసి ఉన్నతాధికారులు గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. గవర్నర్‌తో ఆర్ అండ్ బి శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ప్రత్యేక కార్యదర్శి విజయేంద్రబోయి, ఆర్‌టిసి ఇడిలు సమావేశమయ్యారు. అధికారులతో సమావేశం అనంతరం బిల్లుకు తమిళిసై చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వానికి గవర్నర్ 10 అంశాలను సిఫార్సు చేశారు. న్యాయపర అంశాలు, ఉద్యోగుల ప్రయోజనాలను ఆమె అందులో పేర్కొన్నారు. సందర్భంగా టిఎస్ ఆర్‌టిసి ఉద్యోగులు, వారి కుటుంబాలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రభుత్వంలో చేరడం వల్ల వారికి ప్రయోజనం చేకూరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్ భవన్‌లో దాదాపు గంటన్న ర పాటు ట్రాన్స్‌పోర్ట్, ఆర్‌టిసి ఉన్నతాధికారులతో స మావేశం నిర్వహించిన గవర్నర్ అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆర్టీసి విలీనంపై పలు సిఫార్సులు చేస్తూ గవర్నర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆ మోదించారు. ఆర్‌టిసి విలీనం తర్వాత ఆస్తులు, ఆర్ టిసి సంపదపై హక్కు పూర్తిగా కార్పొరేషన్‌కు ఉండాలని గవర్నర్ తమిళిసై సిఫారసు చేశారు. ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన పూర్తిగా విభజన చట్టాని లోబడి జరగాలని గవర్నర్ సూచించారు. ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తర్వాత వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణ పింఛన్లు, పే స్కేలు, సర్వీస్ నియమాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే ఉండాలని గవర్నర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్టీసిలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు వైద్య కారణాలతో ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు కారణ్య నియామకం కోరేందుకు అనుమతించాలన్నారు. ఆర్టీసిలో క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉన్నాయని, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న సర్వీస్ రూల్సే ఆర్టీసి ఉద్యోగులకు వర్తింపజేయాలని గవర్నర్ సిఫారసు చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News