Monday, December 23, 2024

7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

Assembly budget session from march 7

6న ప్రగతిభవన్‌లో క్యాబినెట్ భేటీ

గత సభ ప్రోరోగ్ కానందున
దానికి కొనసాగింపుగానే
బడ్జెట్ సమావేశాలు 7వ
తేదీ ఉదయం 11.30
గం.కు ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావే శాలు మార్చి 7వ తేదీ నుంచి జరగ నున్నాయి. ఉదయం 11. 30 గం టలకు సభ ప్రారంభం కాగానే రా ష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. మార్చి నెలాఖరులోగా బడ్జెట్ ఆమో దం పొందాల్సి ఉన్న నేపథ్యంలో 6న రాష్ట్ర మం త్రివర్గ సమావేశాన్ని సిఎం కెసిఆర్ ఏర్పాటు చే శారు. సమావేశాల నిర్వహణ తేదీల రారు కోసం సోమవారం ప్రగతి భవన్‌లో ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అత్యున్నత స్థా యి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆ ర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు, రాష్ట్ర శాసనసభా వ్యవ హారాల శాఖ మంత్రి ప్ర శాంత్ రెడ్డి తో పాటు అందుబాటులో ఉన్న ఇ తర మంత్రులు, ముఖ్యమంత్రి కా ర్యాలయ అధి కారులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నా రు. 7న సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంత రం సభను వాయిదా వేస్తారు. అనంతరం బిఎసి సమావేశం నిర్వహించి ఈ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై ప్రభు త్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈసారి నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది.

గత సమావేశాల కొనసాగింపుగానే..

ఇప్పటి వరకు సభను గవర్నర్ ఇంకా ప్రొరోగ్ చేయలేదు. గత శాసనసభ సమావేశాల పొడిగింపుగా స్పీకర్ సభను ఎప్పుడైనా సమావేశ పర్చవచ్చు. అంటే ఈ బడ్జెట్ సమావేశాలు కూ డా గత సమావేశాలకు కొనసాగింపు మాత్రమేన ని తెలుస్తోంది. వాస్తవానికి శాసనసభలో ఏడాదికి ఒకసారి మొదటి సెషన్‌లోనే గవర్నర్ ప్రసంగం ఉండాలి. అలాగే ఎన్నికలు జరిగి కొత్త సభ్యులతో సభ కొలువుదీరే తొలి సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉండాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 (1) కూడా ఇదే చెబుతోంది.

ఈ నేపథ్యంలో రెండవ శాసన సభ 8వ సమావేశం అక్టోబర్ 8వ తేదీన ప్రోరోగ్ కాకుండానే ముగిసింది. సభ ప్రోరోగ్ కాకపోవడంతో తదపరి ప్రారంభమయ్యే శాసన సభా సమావేశాల బడ్జెట్ సెషన్‌ను శాసనసభ స్పీకర్ నేరుగా ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని… కౌన్సిల్‌ను కలిపి ఉభయ సభల సంయుక్త సమావేశం ఉండదు. సమావేశాల కొనసాగింపే అయినందున గవర్నర్ ప్రసంగం ఉండదు.

కాగా గతేడాది 20-21 బడ్జెట్ సమావేశాల సందర్భంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలోనూ అక్కడి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News