Monday, December 23, 2024

ముగిసిన అసెంబ్లీ, మండలి సమావేశాలు

- Advertisement -
- Advertisement -

4 బిల్లులు ఆమోదం
ఉభయ సభలు నిరవధిక వాయిదా

Assembly Council Meetings closed
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ముగిశాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన సమావేశాలు 15వ తేదీతో ముగిశాయి. ఏడు రోజుల్లో 54 గంటల 55 నిమిషాలు పాటు శాసనసభ సాగింది. తెలంగాణ శాసనమండలి నాలుగు రోజుల్లో 12 గంటల పాటు సాగింది. సమావేశాలు అర్థవంతంగా కొనసాగాయని సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సభలో కాంగ్రెస్ సభ్యులకు ఎక్కువ సమయం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కంటే ప్రతిపక్ష నాయకుడికే ఎక్కువ సమయం ఇచ్చామని ఆయన తెలిపారు. తెలంగాణ శాసనమండలి, శాసనసభలను సభాపతులు నిరవధికంగా వాయిదా వేశారు.
ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం..
తెలంగాణ రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లుకు మంగళవారం శాసనసభ ఆమోదం తెలిపింది. 2022 23 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య వినిమయ బిల్లును ముఖ్యమంత్రి కెసిఆర్ ఆసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అనంతరం బడ్జెట్ రూపకల్పన, ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి సభకు వివరించారు. నాలుగు బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News