Monday, December 23, 2024

ఎన్నికల ముందు ఓటర్లకు తాయిలాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓటర్లను మభ్య పెట్టేందుకు తాయిలాలను పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది.ఉచితాల విషయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని , దీన్ని నిరోధించేందుకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయాలని పిటిషన్‌దారు ఆ పిల్‌లో అభ్యర్థించారు. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ , జస్టిస్ జెబి పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడినధర్మాసనం శుక్రవారం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే పిల్‌పై తమ వాదనలను తెలియజేయాలంటూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటుగా కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

ఎన్నికలకు ముందు ప్రభుత్వం నగదు పంపిణీ చేయడంకన్నా దారుణం మరోటి ఉండదు. ఇది ప్రతిసారీ జరుగుతోంది.చివరికి పన్ను చెల్లింపుదారులపై ఈ భారం పడుతోంది.ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాయి’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. భుట్టూలాల్ జైన్ అనే సామాజిక కార్యకర్త ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సిజెఐ ‘ఎన్నికలకు ముందు అన్ని రకాల హామీలు చేస్తున్నారు. మనం దీన్ని కంట్రోల్ చేయలేము’ అని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రప్రభుత్వాలతో పాటుగా కేంద్రప్రభుత్వం, ఎన్నికల సంఘం, ఆర్‌బిఐలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News