Wednesday, January 22, 2025

దేశంలో ఇక ఈ‘సీన్’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా తొలి దశ పరిశీలన ఆరంభం అయింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎంలు), పేపర్‌ట్రయల్ మెషిన్స్ చెక్ చేపట్టారు. ఎటువంటిలోపాలు వీటిలో తలెత్తకుండా ముందుగా చూసుకుంటారని అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. అంతకు ముందు ఈ ఏడాది చివరిలోగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చేపడుతారు. ఈ విధంగా ఇది భారీ ఎన్నికల కసరత్తు అవుతుంది. ఇవిఎంలు పనితీరు, ఓటర్లు ఓటు నిర్థారణ పత్రాలను ముందుగా పరిశీలించుకుంటారని వెల్లడైంది. దీనిని ఫస్ట్ లెవల్ చెక్ (ఎఫ్‌ఎల్‌సి) ప్రక్రియగా పిలుస్తారు.

ఇందులో భాగంగా నమూనా ఎన్నికలు అంటే మాక్ పోల్స్ నిర్వహిస్తారు. ఇది దేశవ్యాప్త కార్యక్రమం. ఎఫ్‌ఎల్‌సిని కేరళలోని అన్ని నియోజవర్గాలతో పాటు దశలవారిగా పలు ప్రాంతాల్లో చేపడుతారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. కేరళలోని వయనాడు లోక్‌సభ స్థానంలో మాక్‌పోల్ ప్రక్రియ జరుగుతున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించారు. క్రిమినల్ పరువు నష్టం దావాలో రాహుల్ గాంధీ దోషిగా ఖరారయి, ఎంపిగా అనర్హత వేటుకు గురయ్యారు. ఇక్కడ ఎన్నికల ఏర్పాట్లను విలేకరులు ప్రశ్నించారు. అయితే ఇటువంటి ప్రక్రియ కోసం ఇసి ఎప్పటికప్పుడు కార్యక్రమం ఖరారు చేసుకుంటుందని, దీనిని రాష్ట్రాల ఎన్నికల సంఘాలు చేపడుతాయని, అక్కడ జరిగే నమూనా ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఏదీ లేదని ఎన్నికల సంఘం తెలిపింది.

తెలంగాణ ఇతర రాష్ట్రాలలోనూ తొలి ఏర్పాట్లు
ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్థానాలతో పాటే ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న లోక్‌సభ స్థానాలకు కూడా ఎఫ్‌ఎల్‌సి జరుగుతుంది. ఇప్పుడు కేరళలోని వయానాడ్, మహారాష్ట్రలో పుణే, చంద్రాపూర్, యుపిలో ఘాజీపూర్, హర్యానాలో అంబాలా లోక్‌సభ స్థానాలు వివిధ కారణాలతో ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ప్రాధమిక తనిఖీల దశలో ఇవిఎంలు, ఇతర మెషిన్లను సాంకేతిక లోపాల సవరణ కోసం ప్రభుత్వ రంగ సంస్థలైన బిఇఎల్, ఇసిఐఎల్‌కు చెందిన ఇంజనీర్ల బృందాలు పరీక్షిస్తాయని అధికారులు తెలిపారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ స్థాయిలో ఇవిఎంలను వాడుతున్న అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా భారత్ నిలిచింది. ప్రతిపక్షాలు తరచూ ఇవిఎంల పనితీరుపై అనుమానాలకు దిగుతున్నాయి. ఇవిఎంలను , పేపర్‌ట్రయల్ మిషన్లను బిఇఎల్, ఇసిఐఎల్ రూపొందించాయి. లోపాలున్న ఇవిఎంలను వెంటనే ఉత్పత్తిదారులకు మరమ్మత్తుల కోసం పంపించడం జరుగుతుంది. వివిధ రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలోనే ఇవిఎంల , పేపర్‌ట్రయల్ మిషిన్ల తనిఖీలతో కూడిన నమూనా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని, సంబంధిత విషయాన్ని ఆయా పార్టీలకు పంపిస్తారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News