Monday, December 23, 2024

ఇరవై రాష్ట్రాలలో ఇలాంటి పాలన ఉందా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ మోడల్ అంటే అన్ని వర్గాలను కలుపుకుని పోయే, సంపూర్ణమైన, సమతుల్యమైన అభివృద్ధి అని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇది తమ పార్టీకి మంచి ఫలితాలను అందిస్తుందని, మూడోసారి అధికారంలోకి రావడానికి తోడ్పడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోను విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) గత ఏడాది అక్టోబర్‌లో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి భారత రాష్ట్ర సమితి( బిఆర్‌ఎస్)గా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివర్లో తెంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం పిటిఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ పాలనా విధానం రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసునని అన్నారు.‘ ఎవరు మెరుగైన పాలన అందించగలరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.

ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రం కోసం ఏం అందించగలిగారో .. ఆయనతో సరి తూగగల వారు ఎవరూ లేరనేది కూడా వారికి తెలుసు’ అని ఆయన అన్నారు. తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్, బిజెపిలు పోటీ పడుతున్నాయని ఆయన అంటూ దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణకన్నా మెరుగైన పాలనను ఏ రాష్ట్రంలోను వారు చూపించలేకపోయారని కెటిఆర్ అన్నారు. ‘అంతేకాదు ప్రజలు పోల్చి చూసుకుంటారు. కాంగ్రెస్, బిజెపిల చేతిలో 20కి పైగా రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటప్పుడు తెలంగాణలో అధికారంకోసం పోటీపడుతున్న ఈ పార్టీలు బిఆర్‌ఎస్ పాలనకన్నా మెరుగైన మోడల్‌ను అందించగలమని నిరూపించగలగాలి’ అని బిఆర్‌ఎస్ బ్యానర్ కింద ఎన్నికలు ఎలా భిన్నంగా ఉంటాయన్న ప్రశ్నకు సమాధానంగా కెటిఆర్ అన్నారు.

గుజరాత్ మోడల్‌కన్నా తెలంగాణ మోడల్ ఎలా భిన్నమైందని ప్రశ్నించగా తాను గుజరాత్ మోడల్‌పై ఎలాంటి వ్యాఖ్యా చేయబోనని, ఎందుకంటే అది ఇప్పటికే పాతబడిపోయిందని ఆయన అన్నారు. వాస్తవం ఏమిటో జనం ఇప్పటికే చూసేశారని కూడా ఆయన అన్నారు.‘ఈ సుపరిపాలన మోడల్ రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఘన విజయం సాధించడానికి, కెసిఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడానికి తోడ్పడుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. దక్షిణాది ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇప్పటివరకు హ్యాట్రిక్ కొట్టలేదు. ఆ ఘనత సాధించిన తొలి ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. నా మాట రాసిపెట్టుకోండి’ అని కెటిఆర్ ధీమాగా చెప్పారు. క్రిందటి ఎన్నికల్లో గిఆర్‌ఎస్ 88 సీట్లు గెలుచుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ మొత్తం 119 స్థానాల్లో 90నుంచి వంద సీట్ల మధ్య గెలుచుకుంటుందని ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికల్లో విజయానికి సుపరిపాలనే ప్రధాన మంత్రంగా ఉంటుందని అన్నారు.

‘సుపరిపాలనకు ప్రత్యామ్నాయం లేదు’ ఆయన స్పష్టం చేశారు. సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం వల్లనే తెలంగాణ తమ పార్టీ విజయం సాధించగలిగిందన్నారు. పార్టీ ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చినందున రాష్ట్రంలో బలంగా ప్రభుత్వ అనుకూల వైఖరి ఉందని ఆయన చెప్పారు. ఆ కారణంగానే తమ పార్టీ మొత్తం 32 జిల్లా పరిషత్ స్థానాలను, 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకుగాను 136, 12,769 గ్రామపంచాయతీల్లో 9,000కు పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకుందని కెటిఆర్ అన్నారు. షర్మిల నేతృత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పారీ,్ట కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల పొత్తు రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రధాన అంశంగా ఉంటుందా అని అడగా, ‘కాంగ్రెస్ పార్టీ ఉన్న కాస్తంత బలం కూడా కోల్పోతుందని నేను కచ్చితంగా చెప్పగలను’ అని కెటిఆర్ వ్యంగ్యంగా అన్నారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి, ఆమె తండ్రి, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారనే విషయం అందరికీ తెలిసిన విషయమేనని అంటూ, ఆమెకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా తెలంగాణకు వచ్చి ఉండే వారు కాదని అన్నారు. ‘వాళ్లు తెలంగాణలో ఓట్లు అడగడమే ఓ జోక్. కాంగ్రెస్ పార్టీ దాన్ని చేర్చుకోవడం మరింత పెద్ద జోక్. అదే జరిగితే ఆ పార్టీ సర్వనాశనం అవుతుంది’ అని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల క్రెడిట్‌ను తనదిగా చెప్పుకోవడానికి బిఆర్‌ఎస్ ఎందుకు ప్రయత్నిస్తోందని అడగ్గా, ‘ చంద్రబాబు 2004లో సిఎంగా ఉన్నారు. మనం 20 ఏళ్ల తర్వాత ఉన్నాం.

నేను 1950లో మొక్క నాటాను, దాని ఫలాలు చంద్రబాబు అనుభవిస్తున్నారని ఎవరైనా అంటే చంద్రబాబు అంగీకరిస్తారా? పాయింట్ ఏమిటంటే తెలంగాణ ఏర్పడినప్పటినుంచీ ప్రతి ప్రభుత్వం ఏదో ఒకటి సృష్టించడానికి తన వంతు కృషి చేసింది’ అని కెటిఆర్ చెప్పారు. ‘ప్రగతిని వేగవంతం చేయడానికి మేము ప్రయత్నించాం. గత తొమ్మిదేళ్లుగా మేము యాక్సిలేటర్‌పైనుంచి కాలు తీయలేదు’ అని కూడా ఆయన అన్నారు. ఐటి రంగానికి సంబంధించి ఉద్యోగాల కల్పనలో తెలంగాణ కర్నాటకకన్నా ఎంతో ముందుందని ఆయనచెప్పారు. హైదరాబాద్‌లో 4.5 లక్షల ఉద్యోగాలను సృష్టించామని, అదే బెంగళూరులో అది 1.46 లక్షలుగానే ఉందని చెప్పారు. సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 2014లో రూ.56 వేల కోట్లు ఉండగా అది ఇప్పుడు రూ.2.41 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.

‘ఇది ఆరంభం మాత్రమే. నిజానికి చేయాల్సింది ఎంతో ఉంది’ అని కూడా ఐటి శాఖ మంత్రికూడా అయిన కెటిఆర్ చెప్పారు. తెలంగాణలోని ఇతర పట్టణాల అభివృద్ధిపై మీ ప్రభుత్వం దృష్టిపెట్టలేదన్న భావన గురించి అడగ్గా అది అర్థం లేనిదని ఆయన అన్నారు. కేంద్రప్రభుత్వంనుంచి మేము 126 అవార్డులు సాధించాం. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్నాం. కేవలం టూటైర్ నగరాలపైనే కాకుండా గ్రామీణ ప్రాంతాలపైనా మేము దృష్టిపెట్టాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ఐదు నగరాల్లో ఐటి హబ్‌లు ఉన్నాయి’ అని ఆయన అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు జరిపై పోరాటం దేశం ముందున్న ప్రధాన సమస్యల ఆధారంగా ఉండాలని, అయితే దురదృష్టవశాత్తు అవి బిజెపిని గద్ద్దె దించాలనే దానిలోనే అవి నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తోందని భారతీయ రాష్ట్ర సమితి( బిఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా కలిసిక్టగా పోరాడే విషయమై చర్చించడానికి ప్రధాన ప్రతిపక్షాలన్నీ పాట్నాలో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News