Monday, January 20, 2025

వచ్చే ఏడాది ఏప్రిల్, మేలోనే అసెంబ్లీ ఎన్నికలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలోనే జరగొచ్చని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ప్రగతి భవన్ లో మంగళవారం బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షడు, మంత్రి కెటిఆర్ చిట్ చాట్ చేశారు. వచ్చే అక్టోబర్ లో రాష్ట్ర ఎన్నికలకు నోటిఫికేషన్ రాకపోవచ్చని, మరో ఆరు నెలల తర్వాతనే ఎన్నికలు ఉండొచ్చని కెటిఆర్ చెప్పారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. జమిలి ఎన్నికలు ఉన్నా లేకపోయినా బిఆర్ఎస్ కే లాభమని ఈ సందర్భంగా కెటిఆర్ చెప్పారు.

కాగా.. వన్‌నేషన్‌, వన్ ఎలక్షన్‌పై ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ అంశంపై కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. ఈ ఏడాదిలో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని, అలాగని ఎన్నికలు నిర్వహించి ఓడిపోతే ఈ ప్రభావం వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలపై పడడం ఖాయమని భావించి, ఎలాగైనా ఈ రాష్ట్రాల ఎన్నికలను వచ్చే ఏడాదికి వాయిదా వేసి, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News