Monday, January 20, 2025

ఇండియా కూటమిలో విభేదాలు రానివ్వం:శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

పుణే : త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు బ్రదర్స్‌గా ఉండేందుకు యత్నిస్తామని ఎన్‌సిపి నేత శరద్ పవార్ తెలిపారు. శుక్రవారం ఈ సీనియర్ నేత మహారాష్ట్రలోని బారామతిలో విలేకరులతో మాట్లాడారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ అభ్యర్థుల ఎంపికలో సర్దుబాట్లు విపక్షాల ఐక్యతకు గీటురాయి అవుతాయని పవార్ అభిప్రాయపడ్డారు. ఉల్లిగడ్డల ధరలు, మరాఠా రిజర్వేషన్ల విషయాలపై కూడా పవార్ మాట్లాడారు.

ఎన్నికలలో వివిధ పార్టీల మధ్య సీట్ల విషయంలో విభేదాలు తలెత్తుతాయని, ఇది సహజమే అన్నారు. సమస్యల సర్దుబాటుకు కొందరు నేతలను ఎంచుకుని రాజీ యత్నాలకు దిగుతామని చెప్పారు. పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి చోట్ల సీట్ల సర్దుబాట్లు పరీక్షగానే మారుతాయని తెలిపారు. అయితే వెంటనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు లేవు. ఇప్పుడు ముందుగా జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా కూటమి సభ్య పక్షాల నడుమ సర్దుబాట్లు సఫలీకృతం అయితే , దీనితో మరింతగా సానుకూలత ఏర్పడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News