Sunday, February 23, 2025

అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి: రాబోవు అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం తన చాంబర్ లో వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సెక్టోరల్ అధికారులు, తహసీల్దార్లు, పోలీసు అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెక్టోరల్ అధికారులు అందరూ వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, అలాగే తక్కువ శాతం పోలింగ్ అయ్యే పోలింగ్ కేంద్రాలను, 90 శాతం వరకు పోలింగ్ అయ్యే పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదికను అందించాలని సూచించారు. ఈ సమావేశంలో వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన తహసీల్దార్లు, పోలీసు అధికారులు, సెక్టోరల్ అధికారులుగా ఎంపికైన వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News