ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం
ఉచిత విద్యుత్‌తో పాటు వివిధ అంశాలపై సిఎం కెసిఆర్ ప్రసంగం
కొత్త బిల్లులు సహా గవర్నర్ తిప్పిపంపిన బిల్లులపై ఉభయ సభల్లో చర్చ
హైదరాబాద్: రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 3,4,5 తేదీల్లో మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు బిఎసిలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ 24 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు ఇ తర అంశాలపై అసెంబ్లీ వేదికగా ప్రసంగించనున్నట్లు తెలిసింది. అందుకనుగుణంగా ప్రభు త్వ యంత్రాంగం సమాయత్తమవుతున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ముగిశాయి. ఆర్నెళ్ల గడువు ప్రకారం ఆగస్టు 11లోపు ఉభయసభలు తిరిగి సమావేశం కావాల్సి ఉంది. దీంతో ఆగస్టు 3వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవే చివరి సమావేశాలు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చ జ రగనుంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త బిల్లులు సహా గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై కూడా ఉభయసభల్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రధానంగా నె లకొన్న సమస్యలను ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తనున్నాయి.ప్రతిపక్షాల వ్యూ హాలను తిప్పికొట్టే విధంగా అధికార బిఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చిన వ ర్షాలు.. వాటి వల్ల సంభవించిన వరదలు.. ఇం కా ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 31న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. రాష్ట్రంలో సంభవించిన భారీ వరదలు, నష్టాలపై కూడా చర్చించి.. పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.