Wednesday, March 12, 2025

నేటి నుంచి అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

27 వరకు కొనసాగనున్న బడ్జెట్ సమావేశాలు నేడు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 19న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం హాజరుకానున్న బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నా యి. ఈ సమావేశాలలో భాగంగా బుధవారం ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. మరుసటి రోజు (మార్చి 13) రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. ఆ మరుసటి రోజు హోలీ నేపథ్యంలో మూడు రోజుల పాటు వాయిదా వేసే అవకాశం ఉన్నది. తిరిగి సోమవారం బడ్జెట్ సమావేశాలు కానున్నట్లు తెలిసింది.

అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే రెండు రోజులపాటు ఈ నెల 17,18 తేదీలలో బిసి కులగణన, ఎస్‌సి వర్గీకరణ ముసాయి బిల్లుపై ఉభయ సభల్లో చర్చించనున్నారు. అనంతరం ఈ నెల 19వ తేదీన ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ నెల 27 వరకు సభను కొనసాగిస్తూ చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా పడనున్నట్లు సమాచారం. ఈ నెల 30న ఉగాధి, 31న రంజాన్ పండుగల నేపథ్యం లో అంతకుముందే అసెంబ్లీ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. బిఆర్‌ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హజరు కానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించినట్లు తెలిసింది. బుధవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే రోజున తాను అసెబ్లీకి హాజరవుతానని చెప్పినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News