Saturday, November 23, 2024

నేటి నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

 

Assembly meetings again from today

నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న శాసనసభ

మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి శాసనమండలి, శాసన సభ సమావేశాలు తిరిగి పునః ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ సృష్టించిన వర్షబీభత్సం కారణంగా ఈ నెల 27 నాలుగు రోజుల పాటు సమావేశాలు వాయిదా పడ్డాయి. దీంతో శుక్రవారం (అక్టోబర్ 1) నుంచి ఉభయ సభలు ఉదయం 10 గంటల నుంచి మొదలుకానున్నాయి. ఈ నెల 24వ తేదీన మొదలైన అసెంబ్లీ,మండలి సమావేశాలు ఆ మర్నాడు మాత్రమే జరిగింది. శని వారం (25వ తేదీ)సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ స భలు(26వ తేదీ ఆదివారం కావడంతో) 27వ తేదీకి వాయిదా పడ్డాయి.

అయితే శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభపోతగా వర్షం కురిసింది. రహదారులన్నీ చెరువు లుగా మారాయి. పలులో తట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి. ఫ లితంగా పలు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా అస్థవ్యస్థంగా మారడం తో పాటు పలు జిలాల్లో రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రజాప్రతినిధులుగా వారికి అండగా ఉండాలన్న లక్షంతో ఉభయ సభలను నాలుగు రోజుల పాటు వాయిదా వేయాలని మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News