Monday, December 2, 2024

9నుంచి అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

గత డిసెంబర్ 9న అసెంబ్లీ నిర్వహించిన సెంటిమెంట్‌తో నిర్ణయం n అదేరోజు తెలంగాణ తల్లి
విగ్రహావిష్కరణ, ప్రజా పాలన విజయోత్సవాల ముగింపు, కులగణన, రైతు భరోసా విధి విధానాలు,
హైడ్రా, కొత్త రెవిన్యూ చట్టం, విచారణ కమిషన్లపై చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్:  ఈ నెల 9 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే అదే రోజు సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాష్కరణ, ప్ర జా పాలన విజయోత్సవాల ముగింపు కార్యక్ర మం ఉండటంతో శాసనసభ సమావేశాలు అదే రోజు నుంచి ప్రారంభించాలా? వద్దా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని అధికార వర్గాల సమాచారం.

కాగా డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ఇదివరకే రెవిన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూత్రప్రాయంగా మీడియా కు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది డిసెంబర్ 9వ తేదిన అసెంబ్లీ సమావేశం నిర్వహించడంతో సెంటిమెంట్‌గా ఈసారి కూడా అదే రోజు (డిసెంబర్ 9) అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోన్నట్టు సీఎంఓ వర్గాల సమాచారం.

కీలక అంశాలపై చర్చ

ఈ నెల రెండో వారం నుంచి ప్రారంభం కాబో యే అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో కీలక అంశాలపై చర్చ జరుగనున్నది. సంక్రాంతి పం డుగ తర్వాత రైతుల ఖాతాలలో రైతు భరోసా వేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ లోగా రై తు భరోసాపై విధి విధానాల ఖరారుపై అసెంబ్లీలో చర్చించి ఖరారు చేయనున్నది. అలాగే కులగణన సర్వే నవంబర్ ౩౦ ముగియడంతో ఆ అంశంపై కూడా అసెంబ్లీలో చర్చించి బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

హైడ్రాపై ప్రభుత్వం ఇది వరకే ఆర్డినెన్స్ తీసుకరావడంతో దీనిపై కూడా సభలో చర్చించి బిల్లు ఆమోదించే అవకాశం ఉందని తెలిసింది. కొత్త రెవిన్యూ చట్టం (ధరణి స్థానంలో భూమాత) ఆమోదం తదితర ముఖ్యమైన అంశాలు ఈ సమావేశాలలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించిన కమిషన్ల నుంచి సకాలంలో నివేదికలు వస్తే వాటిపై కూడా సభలో ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాల సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News