Sunday, January 19, 2025

‘ఇండియా’ కూటమిపై అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదు: పవార్

- Advertisement -
- Advertisement -

ముంబయి: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ‘ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై ఉండబోదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ( ఎన్‌సిపి) అధినేత శరద్‌పవార్ అన్నారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో భారతీయ జనతాపార్టీ రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీనుంచి అధికారాన్ని లాక్కోవడంతో పాటు రాజస్థాన్‌లో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడం తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గత రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ను గద్దె దింపి తొలిసారి అధికారంలోకి రానుంది.‘ ఈ ఫలితాలు ఇండియా కూటమిపై ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవడం లేదు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే నివాసంలో మేము త్వరలో సమావేశం కానున్నాం. క్షేత్రస్థాయి పరిస్థితి గురించి తెలిసిన వారితో మాట్లాడుతాం

ఆ సమావేశం తర్వాత మాత్రమే దీనిపై వ్యాఖ్యానించగలుగుతాం’ అని పవార్ చెప్పారు. అయితే ప్రస్తుత ట్రెండ్ బిజెపికి అనుకూలంగా ఉందనే విషయాన్ని అందరూ అంగీకరించాలని కూడా ఆయన అన్నారు.తెలంగాణలో కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీకన్నా వెనుకబడి ఉండడం గురించి అడగ్గా ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నా పవార్ అన్నారు. ‘ తెలంగాణను బిఆర్‌ఎస్ తిరిగి నిలబెట్టుకుంటుందని ఇంతకు ముందు అందరూ అనుకున్నారు. అయితే రాహుల్ గాంధీ ర్యాలీకి లభించిన భారీ స్పందన చూసిన తర్వాత రాష్ట్రంలో మార్పు రావచ్చని మేము గ్రహించగలిగాం’ అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News