Sunday, January 12, 2025

నేటి నుంచి అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

పలు బిల్లులకు ఆమోదం, కీలక అంశాలపై చర్చ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్న అధికార, ప్రతిపక్షాలు n కాళేశ్వరం, విద్యుత్ కేంద్రాలు, ధరణి, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై ప్రతిపక్షాన్ని ఇరకాటం పెట్టే వ్యూహంతో అధికార పక్షం n హైడ్రా, మూసీ
కూల్చివేతలు, రుణమాఫీ, గురుకులాల దుస్థితి, లగచర్లపై ప్రభుత్వంపై ఎదురుదాడి వ్యూహంతో ప్రతిపక్షం n సమావేశాల
పనిదినాలు వారం మించకపోవచ్చు అంటున్న అధికార పార్టీ n నెల రోజులు నిరహించాలి: ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్: శాసనసభా, సమావేశాలు సోమవారం ఉ దయం 10:30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజునే పలు బిల్లులను స భలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరియు పిం ఛన్ చెల్లింపు మరియు అనర్హతల తొలగింపు (సవరణ) ఆ ర్డినెన్సు, తెలంగాణ పురపాలక సంఘాల (సవరణ) ఆర్డినెన్సు, హైదరాబాదు మహానగర పాలక సంస్థ (సవరణ) ఆర్డినెన్సు,తెలంగాణ వస్తువుల మరియు సేవల పన్ను (సవరణ) ఆర్డినెన్సు, తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) ఆర్డినెన్స్‌లను సభలో ప్రవేశపెడుతారు. అలాగే వి ద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక, అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ వార్షిక నివేదికలను సంబంధితశాఖల మంత్రులు సభలో ప్రవేశపెడుతారు.
వాడివేడిగా సమావేశాలు
శాసనసభా, శాసనమండలి సమావేశాలు ఈసారి వాడీవేడిగా జరగనున్నాయి. సభలో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహంతో ప్రధాన ప్రతిపక్షం, గతంలో అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఎదురుదాడికి పాలకపక్షం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. గత బీ ఆర్‌ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి స్థానంలో కొత్త ఆర్ ఓఆర్ చట్టాన్ని ఇదే సమావేశాలలో తీసుకరాబోతున్నట్టు రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన తెలిసిందే. కాగా దీంతో పాటు ఇదివరకే ఆర్డినెన్స్‌తో తీసుకొచ్చిన హైడ్రా బిల్లు ఈ సమావేశాల లో చట్టం కాబోతుంది. అలాగే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ నామకరణం, గతంలో గవర్నర్ తమిళసై హయాంలో తిరస్కరించిన కొన్ని బిల్లులకు కూడా కొన్ని సవరణలతో ఈ సమావేశాలలో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అస్త్రశస్త్రాలతో పాలక,ప్రతిపక్షాలు సిద్ధం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టిన ధ రణి తప్పిదాలు, విద్యుత్ కేంద్రాలపై ఏర్పాటులో జరిగి న అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీల కుంగుబాటు, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్లపై కూడా ఈ సమావేశాల లో పెట్టాలని పాలకపక్షం భావిస్తుంగా, కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవ డం, పూర్తిస్థాయిలో జరగకపోవడం, మూసీనదిలో అక్రమకట్టడాల కూల్చివేతలు, హైడ్రా చట్టబద్ధతా, అది చేపట్టిన కూల్చివేతలు, గురుకుల విద్యాలయాలలో ఇటీవల జరిగిన ఘటనలు, ఎన్నికల సందర్భంగా ఇచ్చి న ఆరు గ్యారంటీలో పూర్తిస్తాయిలో అమలుకు నోచుకోకపోవడం తదితర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీతకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సమయా త్తం అవుతుంది. ఈ మేరకు పార్టీ ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
సమావేశాలు ఎప్పటివరకు?
శాసనసభా, శాసనమండలి సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై సోమవారం స్పీకర్ ప్ర సాద్‌కుమార్ అధ్యక్షతన జరిగే బీఏసీలో (బిజినెస్ అ డ్వజరీ కమిటీ) ఖరారు కానున్నది. పెండింగ్‌లో ఉన్న బిల్లు ల అమోదం కోసం ఈ సమావేశాలను నిర్వహిస్తుండటంతో సమావేశాల పనిదినాలు వారం కంటే మించకపోవచ్చని పాలకపక్ష నేతల సమాచారం. కాగా ఈ సమావేశాలను మొక్కుబడిగా కాకుండా నెల రోజుల పాటు ని ర్వహించాలని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కెటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News