Monday, December 23, 2024

తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతుంది: ఎంపి ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెలాఖరున తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుందని నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతుందన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు . వచ్చే ఎన్నికల్లో తనకు 50 వేల మెజారిటీ వస్దుందన్నారు. ఒకవేళ 50 వేల మెజారిటీ రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. కోదాడ అసెంబ్లీ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2019 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కానీ ఈ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి చేతిలో పద్మావతి ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో మరోసారి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. తరచుగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News