Monday, January 20, 2025

ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల దరఖాస్తులో ఆస్తుల వివరాల తొలగింపు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో మరింత మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు
అర్హత కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం
భారీగా ఉద్యోగ నియామకాల నేపథ్యంలో సడలింపు

మనతెలంగాణ/హైదరాబాద్: ఎకనామికల్లీ వీకర్ సెక్షన్(ఇడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గ దర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులో మీసేవ మార్పులు చేయనుంది. ఈ మేరకు మార్పులను సూచిస్తూ రెవెన్యూశాఖ, సీసీఎల్‌ఎలు.. మీసేవ కమిషనర్‌కు లేఖ రాశాయి. రూ .8 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి 10 శాతం ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం .. వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, రెసిడెన్షియల్ ఫ్లాట్లకు సంబంధించి కొన్ని షరతులు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని సడలించి అన్ని రకాలుగా కుటుంబ ఆదాయం రూ.8 లక్షలు మించరాదని పేర్కొంది. ఈ మేరకు 2021 ఆగస్టు 24న సమగ్ర విధివిధానాలతో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మీ సేవ ద్వారా తీసుకునే దరఖాస్తులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా మార్పులు చేయలేదు.

రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దరఖాస్తుతో పాటు ధ్రువపత్రంలోనూ మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా మీ సేవ కమిషనర్‌కు సీసీఎల్‌ఎ లేఖ రాసింది. రాష్ట్రంలోని ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం దరఖాస్తులో విడిగా పొందుపర్చాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ల కోసం ప్రస్తుతం ఉన్న దరఖాస్తు విధానం యధావిధిగా కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కోసం చేసే దరఖాస్తుల్లో ఆస్తుల వివరాల విభాగాన్ని తొలగించనున్నారు.

5 ఎకరాల వ్యవసాయభూమి, ఫ్లాటు, ప్లాటు వివరాల విభాగాన్ని కూడా తొలగించనున్నారు. ధ్రువపత్రంలోనూ ఆస్తుల వివరాలకు సంబంధించిన విభాగం లేకుండా మార్పులు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అందుకు అనుగుణంగా డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సర్వీసులోని దరఖాస్తులో మార్పులు చేయాలని ప్రభుత్వం మీసేవకు స్పష్టం చేసింది. ఇడబ్లూఎస్ కోటా కింద ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10 రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం కలిగిన ఉన్న అగ్రవర్ణ కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.

Assets details remove from EWS Reservation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News