Thursday, November 14, 2024

ఖలిస్తానీ ఉగ్రవాదుల ఆస్తులు జప్తు!

- Advertisement -
- Advertisement -

19 మంది ఖలిస్థానీ నేతల
ఆస్తుల జప్తు చర్యలు
జాబితా సిద్ధం చేసిన నియా, ఉపా ఉక్కుపాదం

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖలీస్థానీ ఉగ్రవాదులపై తీవ్రస్థాయిలో ఉక్కుపాదం మోపేందుకు భారతదేశం సంసిద్ధం అయింది. ఈ దిశలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఫరారీలో ఉన్న 19 మంది ఖలీస్థానీ ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేసింది. ఈ 19 మంది టెర్రరిస్టుల ఆస్తులను జప్తు చేసేందుకు నియా సిద్ధం అయింది. ఇప్పటికే ఖలీస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కు ఫర్ జసిస్ (ఎస్‌ఎఫ్‌జె) నేత గురుపత్వంత్ సింగ్ పన్నున్ ఆస్తుల సీజ్, అణచివేత చర్యలు చేపట్టిన నియా ఇప్పుడు తమ చర్యలను ఉధృతం చేసిది. ఖలీస్థాన్ వాదంతో చలామణిలో ఉన్న పలువురు నేతలు కెనడా, దుబాయ్, బ్రిటన్, అమెరికా, పాకిస్థాన్ ఇతర దేశాలలో ఉన్నారు. వీరికి చెందిన భారత్‌లోని ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం అయింది.

ఈ 19 మందిపై అత్యంత కఠినమైన నిబంధనల చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) ఆధ్వర్యంలో చర్యకు దిగుతారు. నియా సిద్ధం చేసిన జాబితాలో ఇప్పుడు బ్రిటన్‌లో ఉన్న పరంజిత్ సింగ్ పమ్మ, పాకిస్థాన్‌లో తలదాచుకున్న వాద్వా సింగ్ బాబ్బర్ అలియాస్ చాచా , యుకెలోని కుల్వంత్ సింగ్ ముత్రా, అమెరికాలో ఉన్న జై ధాలీవా, యుకెలోని సుఖ్‌పాల్ సింగ్, యుఎస్‌లోని హర్ప్రీత్ సింగ్ అలియాస్ రానా సింగ్, యుకెలోని సరబ్జిత్ సింగ్, యుకెలోని కుల్వంత్ సింగ్ అలియాస్ కాంటా , కాలీఫోర్నియాలో ఉంటున్న హర్జప్ సింగ్ అలియాస్ జప్పి సింగ్ వంటి మొత్తం 19 మంది ఉన్నారు. కేవలం కెనడాలోనే కాకుండా వీరిలో అత్యధికులు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలో ఉంటూ తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ తేల్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News