Sunday, January 19, 2025

రూ. 22,280 కోట్ల విలువైన మాల్యా, చోక్సీ ఆస్తులు స్వాధీనం : నిర్మలాసీతారామన్

- Advertisement -
- Advertisement -

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా అనేక కేసులకు సంబంధించిన ప్రాపర్టీలను సీజ్ చేసి అటాచ్ చేసింది. ఆర్థిక నేరాలకు లింకున్న ఆ ప్రాపర్టీలను స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సీతారామన్ బదులిస్తూ విజయవంతంగా ఈడీ సుమారు 22, 280 కోట్ల విలువైన ప్రాపర్టీలను సీజ్ చేసినట్టు చెప్పారు. దీంట్లో విజయ్ మాల్యాకు చెందిన 14, 131. 6 కోట్ల ఆస్తి ఉన్నట్టు చెప్పారు. ఇక నీరవ్ మోదీ కేసులో రూ .1052.5 కోట్ల ఆస్తుల్ని బ్యాంకులు జప్తు చేసుకున్నట్టు చెప్పారు.

నేషనల్ స్పాట్ ఎక్స్‌ఛేంజ్ స్కామ్‌లో రూ.17.47 కోట్లు బ్యాంకులు సీజ్ చేశాయన్నారు. ఎస్‌ఆర్‌ఎస్ గ్రూపుకు చెందిన రూ.20.15కోట్లు , రోజ్ వాలీ గ్రూపుకు చెందిన రూ. 19.40 కోట్లు, సూర్య ఫార్మసీకి చెందిన రూ.185.13 కోట్లు, నౌషేరా షేక్ గ్రూపుకు చెందిన రూ.226 కోట్లు, నాయుడు అమృతేశ్ రెడ్డికి చెందిన రూ. 12.73 కోట్ల ప్రాపర్టీలను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. మోహుల్ చోక్సీకి చెందిన రూ.2565.90 కోట్ల విలువైన ప్రాపర్టీలను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News