Friday, December 20, 2024

ఎన్నికల సమగ్రతకు తప్పుడు కథనాలతో విఘాతం: సిఇసి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సమగ్రతను దెబ్బతీసే నకిలీ కథనాల వంటి సవాళ్లపై పని చేయడానికి ఎలక్షన్ మేనేజ్‌మెంట్ బాడీస్ (ఇఎంబి)లు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ అన్నారు. బుధవారం కొలంబియాలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ 11వ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం హాజరయ్యారు.

అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్‌లో ప్రపంచవ్యాప్తంగా 119 ఇఎంబిలు సభ్యులుగా & 20 ప్రాంతీయ సంఘాలు/సంస్థలు అసోసియేట్ సభ్యులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న నకిలీ కథనాలను ఎదుర్కోవడం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి కలిసి ఇఎంబిలు పనిచేయగలవని ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రతినిధి బృందంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనోజ్ సాహూ, జాయింట్ డైరెక్టర్ అనుజ్ చందక్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News