- Advertisement -
కడప: రవాణా శాఖకు కీర్తి తెచ్చేలా ఉద్యోగులు విధులు నిర్వహించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖలో కీచక అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రవాణాలో శాఖలో మహిళలను అధికారులు వేధిస్తుండడంతో ఆయన స్పందించారు. బాధిత మహిళలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు తలెత్తితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. భవిష్యత్తులో అధికారులు ఇలాంటివి చేయకుండా చర్యలు చేపడుతామని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -