Thursday, December 26, 2024

భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం

- Advertisement -
- Advertisement -

విశ్వంలో ఓ గమ్యం అంటూ లేకుండా సంచరిస్తోన్న గ్రహశకలాలు భూమి వైపుగా దూసుకువస్తుంటాయి. వీటిలో కొన్ని భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుంటాయి. అప్పుడప్పుడు చిన్న శకలాలు భూమి వాతావరణం లోకి ప్రవేశిస్తుంటాయి. ఈనెల 24న మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో భూమికి దగ్గర నుంచి ఓ గ్రహశకలం వెళ్తుందని నాసా వెల్లడించింది. విమానం సైజులో ఉండే ఈ గ్రహ శకలానికి 2024 టిపీ 17గా నామకరణం చేసింది. ఇది భూమికి 46 లక్షల కిమీ దూరం నుంచి ప్రయాణిస్తుందని, భూమికి దగ్గరగానే వెళ్తుందని, గంటకు 20,832 కిమీ వేగంతో దూసుకెళ్తుందని నాసా పేర్కొంది. ఈ ఆస్టరాయిడ్ గమనాన్ని నాసా పరిశీలిస్తోంది. ఈ గ్రహ శకలం నుంచి భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News