యుకె వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ మాజీచైర్మన్ క్లైవ్‌డిక్స్
లండన్: బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ కొవిడ్19కు అడ్డుకట్ట వేయడంలో సమర్థవంతంగా పని చేస్తున్నదని వైద్య నిపుణుడొకరు విశ్లేషించారు. యూరోపియన్ దేశాలతో పోలిస్తే యుకెలో మరణాల రేట్ తక్కువగా ఉండటమే అందుకు నిదర్శనమన్నారు. యుకె వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ మాజీ చైర్మన్ డాక్టర్ క్లైవ్‌డిక్స్ ‘డైలీ టెలీగ్రాఫ్’తో మాట్లాడుతూ వ్యాక్సిన్ పనితీరును విశ్లేషించారు. ఇదే వ్యాక్సిన్‌ను భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో విరివిగా వినియోగించడం తెలిసిందే. కొవిడ్19 సోకినవారు మరణించకుండా కొవిషీల్డ్ దృఢమైన రక్షణ ఇస్తున్నదన్నారు. ఆ దేశంలోని వయో వృద్ధులకు ఈ వ్యాక్సిన్‌నే మొదట వినియోగించారు.
ఇయు దేశాలకన్నాముందే బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభించడం గమనార్హం. ఇయు దేశాలతో పోలిస్తే కేసులు, చనిపోతున్నవారి సంఖ్య బ్రిటన్‌లో చాలా తక్కువని డిక్స్ తెలిపారు. యుకెలో కొవిడ్ వల్ల పదిలక్షల మందికి మరణాలరేట్ 1.7 కాగా, ఇయు దేశాల్లో 4గా ఉన్నదని ఆయన తెలిపారు. కొవిషీల్డ్‌ను అడినోవైరస్‌తో తయారు చేశారు. బూస్టర్ డోస్‌గా ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్లు మోడెర్నా లేదా ఫైజర్‌ను వినియోగించవచ్చునని డిక్స్ తెలిపారు. ప్రత్యామ్నాయ వ్యాక్సిన్ల వల్ల దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.