Monday, January 20, 2025

మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన వ్యోమగామి సునీతా విలియమ్స్

- Advertisement -
- Advertisement -

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షం లోకి వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో మరో వ్యోమగామి బచ్ విల్మోర్‌తో కలిసి భారత కాలమానం ప్రకారం మే 7 వ తేదీ ఉదయం 8.04 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్నారు. ఈ ప్రయోగంలో సునీతా విలియమ్స్ మిషన్ పైలట్‌గా వ్యవహరిస్తారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవ సహిత యాత్ర. సునీతా విలియమ్స్ ,బచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చేరుకుని అక్కడ వారం రోజుల పాటు ఉంటారు. అంతరిక్ష యాత్రలో సునీతా విలియమ్స్ ఎన్నో విజయాలు నమోదు చేశారు. అంతరిక్షంలో ఎక్కువ సమయం పాటు గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించారు.

గతంలో 2006,2012లో అంతరిక్షం లోకి వెళ్లి వచ్చారు. ఈ రెండు మిషన్లలో భాగంగా ఆమె 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి రికార్డు సృష్టించారు. 2012 జులై 14న రెండోసారి అంతరిక్షయాత్ర చేసిన సునీత నాలుగు నెలల పాటు అంతరిక్షం లోనే గడిపారు.మహిళా వ్యోమగామిగా మొత్తం 29 గంటల 17 నిమిషాల్లో నాలుగు స్పేస్ వాక్‌లు చేసి రికార్డు నమోదు చేసుకోగా, తరువాత పెగ్గీవిట్సన్ అనే వ్యోమగామి మొత్తం ఐదు స్సేస్‌వాక్‌లు చేసి 2008 లో రికార్డు సాధించారు. ఒక సమయంలో 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేసి మరో రికార్డును సునీత సాధించ గలిగారు. అయితే ఆ తరువాత ఇప్పుడు ఈ కొత్త వ్యోమనౌకలో ప్రయాణించేందుకు ఎలాంటి కంగారు లేదని చెప్పారు. లాంచ్ ప్యాడ్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు తమకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా శిక్షణ ఇచ్చారని తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నప్పుడు తన ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుందని తన అనుభూతిని తెలియజేశారు.

అంతరిక్షంలో సమోసాలు తినడానికి సునీతా విలియమ్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సునీతా విలియమ్స్ (58) ఒహియోలో యూస్లిడ్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు దీపక్ పాండ్యా, బోనీ పాండ్యాలు. తండ్రి దీపక్ పాండ్యా న్యూరో అనాట.మిస్ట్. ఆయన గుజరాత్ లోని జులాసన్‌లో జన్మించారు. అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసి అమెరికాకు వలస వెళ్లారు. స్లోవేనియన్‌కు చెందిన బోనీ పాండ్యాను వివాహం చేసుకున్నారు. సునీతా విలియమ్స్ 1998లో తొలిసారి వ్యోమగామిగా ఎంపికైంది. 2015 లో స్పేస్ షటిల్ రిటైర్ అయిన తరువాత నాసా వాణిజ్య సిబ్బంది కార్యక్రమంలో ప్రయాణించడానికి ఎంపికైంది. ఇప్పుడు బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో క్రూఫ్లైట్ టెస్ట్ మిషన్‌కు పైలట్‌గా ఉండడానికి సిద్ధమైనట్టు నాసా తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News