- Advertisement -
బీజింగ్ : చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి ఆదివారం ముగ్గురు వ్యోమగాములు విజయవంతంగా చేరుకున్నారు. అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని పూర్తి చేసే పనిలో వీరు ఆరు నెలల పాటు అక్కడే ఉంటారు. షెంజో 14 వ్యోమనౌక ద్వారా నిర్దేశించిన కక్ష కు ముగ్గురు వ్యోమగాములు చెన్‌డాంగ్, లియూ యాంగ్, కే జిఝే చేరుకున్న తరువాత విజయవంతంగా తియాన్‌హే అంతరిక్ష కేంద్రం లోకి ప్రవేశించారని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ ( సిఎంఎస్‌ఎ ) ప్రకటించింది. వాయువ్య చైనా లోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి వ్యోమనౌక బయలు దేరింది. కొన్ని నిమిషాల తరువాత గ్రౌండ్ కంట్రోల్ అధికారి ఈ మిషన్ విజయవంతమైందని ప్రకటించారు. అంతరిక్ష కేంద్రం లోని వివిధ విభాగాల అమరిక, నిర్మాణం పూర్తి చేసే పనుల్లో క్షేత్రస్థాయి బృందానికి ఈ ముగ్గురు వ్యోమగాములు సహకరిస్తారని సిఎంఎస్‌ఎ వివరించింది.
- Advertisement -