Friday, November 15, 2024

భారీ స్థాయిలో కాస్మిక్ పేలుళ్ల కాంతులు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఇంత వరకూ ఎప్పుడూ లేని స్థాయిలో తాము అతి భారీ స్థాయి విశ్వ సంబంధిత కాస్మిక్ పేలుళ్లను గుర్తించినట్లు ఖగోళశాస్త్రజ్ఞులు తెలిపారు. దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఈ భారీ పేలుళ్ల పరిణామం సాగుతోందని గుర్తించినట్లు వివరించారు. ఈ పరిణామాన్ని ఎటి 2021/డబ్లు ఎక్స్‌గా శాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారు.

భూమికి దాదాపు ఎనిమిది బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఈ పేలుళ్ల ఘట్టం సాగుతోందని సౌతాంప్టన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రజ్ఞులు తెలిపారు. మూడేళ్లుగా విశ్వంలోని ఈ అంతర్గత పరిణామం సాగుతూ ఉన్నప్పటికీ గత కొద్ది నెలలుగా ఈ దైదీప్యమాన కాంతిని గుర్తించినట్లు వివరించారు. దీని పూర్వాపరాలు, పరిణామాలపై అధ్యయనం సాగిస్తోన్న బృందానికి ఫిలిప్ వైస్మెన్ సారధ్యం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News