Tuesday, January 21, 2025

భూమి వంటి మరో నివాసయోగ్య గ్రహం..

- Advertisement -
- Advertisement -

భూమిపై దాడికి గ్రహాంతరవాసులు వస్తారో లేక శాంతిని ప్రసాదిస్తారో తెలీదు కానీ, విస్తరిస్తున్న విశాల విశ్వం నుంచి మనకు అత్యంత ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, గ్రహాలపై జీవి ఆనవాళ్లు, నివాసాల అనుకూలతలపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు దాదాపు అన్ని విధాలా భూమిని పోలిన బాహ్య ఉపగ్రహాన్ని కనుగొన గలిగారు.

జీవితం సాగించడానికి తగిన అన్ని సానుకూలతలు ఈ గ్రహంపై ఉన్నాయి. ఈ ఉపగ్రహం తన నక్షత్రం చుట్టూ నివాసయోగ్య జోన్ (habitable zone)లో ఉంటోంది. సౌర వ్యవస్థలో మన భూమి కూడా కచ్చితంగా నివాసయోగ్య జోన్ లోనే ఉంటోంది. ఇప్పుడు కనుగొన్న ఈ బాహ్య ఉపగ్రహం దాదాపు భూమి అంత పరిమాణంలోనే ఉంది. అంటే భూమికన్నా 1.36రెట్లు ఎక్కువ. ఈ ఉపగ్రహానికి వూల్ఫ్ 1069బి (wolf 1069 b) అని పేరు పెట్టారు.

ఇది మనకు కేవలం 31 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. జర్మనీ లోని మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనమీ (ఎంపిఐఎ)కి చెందిన డయానా కొస్సాకోవ్‌ష్కి నేతృత్వం లోని పరిశోధక బృందం ఈ గ్రహాన్ని కనుగొన గలిగింది. ఈ గ్రహం డేటాను తాము విశ్లేషించగా, గ్రహంపై తక్కువ వ్యాప్తిలో భూమి ద్రవ్యరాశిని స్పష్టంగా కనుగొన గలిగామని కొస్సాకోవ్‌స్కీ పేర్కొన్నారు.

ఇది మరో గ్రహం అంటే నక్షత్రం చుట్టూ 15.6 రోజులు పరిభ్రమిస్తుందని, భూమికి, సూర్యునికి మధ్య 15 వ వంతు దూరంలో సమానంగా ఉంటోందని చెప్పారు. సూర్యునికి భూమి ఎంత దూరంలో ఉందో అంతకన్నా చేరువగా ఈ గ్రహం తన ఎర్రని మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోందని చెప్పారు. ఈ కేటగిరి నక్షత్రాలు సాధారణంగా సూర్యుని కన్నా తక్కువ వేడితో ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News