Thursday, December 19, 2024

ఆరు నూతన ల్యాప్‌టాప్‌లు విడుదల చేసిన అసుస్‌..

- Advertisement -
- Advertisement -

అసుస్‌ నేడు తమ కన్స్యూమర్‌ నోట్‌బుక్‌ శ్రేణిని ఆరు నూతన క్రియేటర్‌ సిరీస్‌ ల్యాప్‌టాప్‌లను భారతీయ మార్కెట్‌లో విడుదల చేయడం ద్వారా విస్తరించినట్లు వెల్లడించింది. కంటెంట్‌ క్రియేటర్లు మరియు వినియోగదారుల కోసం సృజనాత్మకంగా తీర్చిదిద్దిన ఈ నూతన శ్రేణి అసుస్‌ క్రియేటర్‌ సిరీస్‌ ల్యాప్‌లలో ఫ్లాగ్‌షిప్‌ జెన్‌బుక్‌ ప్రో 14 డ్యూయో ఓఎల్‌ఈడీ మరియు ప్రో 16ఎక్స్‌ ఓఎల్‌ఈడీ తో పాటుగా ప్రో ఆర్ట్‌ స్టూడియోబుక్‌ 16 ఓఎల్‌ఈడీ మరియు 16 ఓఎల్‌ఈడీ; వివోబుక్‌ ప్రో 15 ఓఎల్‌ఈడీ, 16 ఎక్స్‌ ఓఎల్‌ఈడీ ఉన్నాయి. నూతన జెన్‌బుక్‌ శ్రేణి 1,44,990 రూపాయలతో ప్రారంభమవుతుంది. స్టూడియో బుక్‌ శ్రేణి 1,99,990 రూపాయలతో మరియు వివోబుక్‌ ప్రో లైనప్‌ 67,990 రూపాయలతో ప్రారంభమవుతుంది. ఇవి ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా లభ్యం కానున్నాయి. క్రియేటర్లు మరియు ఆర్టిస్ట్‌లు యొక్క వృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చే రీతిలో రూపొందించిన ఈ క్రియేటర్‌ సిరీస్‌ ఉపకరణాలు వినూత్నమైన డిజైన్స్‌, విప్లవాత్మక సాంకేతికతలను కలిగి ఉండటంతో పాటుగా సాటిలేని సౌందర్యం, సౌకర్యవంతమైన వినియోగదారుల అనుభవాలను సైతం అందిస్తుంది.

ఈ ఆవిష్కరణ గురించి అర్నాల్డ్‌ సు, బిజినెస్‌హెడ్‌, కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌, అసుస్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘అసుస్‌ వద్ద, మేమెప్పుడూ కూడా నూతన సాంకేతికతను పరిచయం చేసే అవకాశం లభించిన ప్రతి సారీ అగ్రగామిగా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. క్రియేటర్‌ సిరీస్‌ ఆవిష్కరణ ఇప్పుడు మరోమారు క్రియేటర్స్‌ కమ్యూనిటీకి ఓ ప్రత్యేకతను తీసుకువచ్చే దిశగా వేసిన ఓ ముందడుగు. మేము మా ల్యాప్‌టాప్‌లను మా వర్క్‌ఫ్లో పరంగా సృజనాత్మక హద్దులను అధిగమించే రీతిలో తీర్చిదిద్దాము. ఇవి అసాధారణ పనితీరు, డిజైన్‌, ఔత్సాహిక వాతావరణాన్ని క్రియేటర్లకు అందించనున్నాయి. మరీ ముఖ్యంగా ఎక్కువగా ప్రయాణాలలో ఉంటూ ఉండేవారితో పాటుగా పూర్తిగా అంకితం చేసిన కార్యక్షేత్రాలలో పనిచేయడానికి ప్రాధాన్యతనిచ్చేవారికి అనువుగా ఉంటాయి’’ అని అన్నారు.

ASUS Launches 6 new Zenbook Laptops in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News