Wednesday, January 22, 2025

సరికొత్త రోగ్‌ జెఫిరస్‌ డ్యుయో 16, ఫ్లో ఎక్స్‌16ను పరిచయం చేసిన అసుస్‌

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆసుస్‌ ఇండియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ గేమర్స్‌ (ROG) నేడు తమ జెఫిరస్‌ మరియు ఫ్లో శ్రేణిని రోగ్‌ జెఫిరస్‌ డ్యుయో 16, జెఫిరస్‌ 14 మరియు ఫ్లో 16తో పాటుగా శక్తి మరియు మెరుగైన పనితీరుతో ఆధునీకరించిన తాజా ఎడిషన్స్‌ జెఫిరస్‌ జీ15 మరియు ఫ్లో ఎక్స్‌ 13 ఆవిష్కరణతో బలోపేతం చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లలో ఏఎండీ రైజన్‌ 6000 సిరీస్‌ మొబైల్‌ ప్రాసెసర్లు మరియు ఎంయుఎక్స్‌ స్విచ్‌ ఉన్నాయి. ఇవి రాజీలేని రీతిలో శక్తివంతమైన గేమింగ్‌ ప్రదర్శన అందిస్తాయి. ఈ ల్యాప్‌టాప్‌లు అసుస్‌ యొక్క విస్తృతశ్రేణి గేమింగ్‌ జాబితాకు తాజా జోడింపు మరియు వీటిని అత్యాధునిక సాంకేతికతతో గేమర్ల యొక్క పోటీతత్త్వం మెరుగుపరిచేందుకు తీర్చిదిద్దారు. ‘కంపాక్ట్‌ ఈజ్‌ ద న్యూ ఇంపాక్‌’్ట అనే సిద్ధాంతంతో తాజా గేమింగ్‌ శ్రేణి, గేమర్లకు వైవిధ్యతను అందిస్తూనే మెరుగైన గేమింగ్‌ అనుభవాలను అందిస్తుంది. నూతన శ్రేణి జెఫిరస్‌ డ్యుయో 16 ధరలు 2,49,990 రూపాయలతో ప్రారంభమైతే, జెఫిరస్‌ జీ14 ధర 1,46,990 రూపాయలు, జెఫిరస్‌ జీ15– 1,57,990 రూపాయలతో ప్రారంభమవుతుంది. దీనిని ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. అదే సమయంలో రోగ్‌ ఫ్లో ఎక్స్‌16 ధర 1,71,990 రూపాయలు, ఫ్లో ఎక్స్‌ 13– 1,21,990 రూపాయలతో ప్రారంభమవుతాయి. ఇది ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ మార్గాలలో లభ్యమవుతాయి.

ఈ ఆవిష్కరణకు అనుగుణంగా అసుస్‌ రోగ్‌ ఇప్పుడు బీ యు విత్‌ రోగ్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులు తమ సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశమందిస్తుంది.

నూతన శ్రేణి గేమింగ్‌ కంప్యూటర్ల ఆవిష్కరణ గురించి అర్నాల్డ్‌ సు, బిజినెస్‌ హెడ్‌, కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌, అసుస్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘అసుస్‌ వద్ద మేము మా వినియోగదారులకు సంపూర్ణమైన గేమింగ్‌ అనుభవాలను అందించడాన్ని గర్వంగా భావిస్తుంటాము. ఈ నూతన జెఫిరస్‌ మరియు ఫ్లో శ్రేణి తో పూర్తి సరికొత్త రీతిలో లీనమయ్యేలా అనుభవజ్ఞులు మరియు ఔత్సాహిక గేమర్లకు అనుభవాలను అందించగలమని భావిస్తున్నాము. పూర్తి సన్నటి ఛాసిస్‌ కలిగిన ఈ మెషీన్లు, ఎక్కడకు తీసుకువెళ్లినా వినూత్నశైలిని తమ వెంట తీసుకువెళ్తాయి. అది మీరు ఇంటిలో ఉన్నా, వర్క్‌స్టేషన్‌ లేదా గేమింగ్‌ బ్యాటిల్‌ స్టేషన్‌లో ఉన్నా అవి వైవిధ్యమైన అందాన్ని అందిస్తాయి’’ అని అన్నారు.

‘‘అసుస్‌ ఇండియాతో భాగస్వామ్యం చేసుకుని నూతన రోగ్‌ ఫ్లో మరియు జెఫిరస్‌ సిరీస్‌ హై ఫెర్‌ఫార్మెన్స్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయడం పట్ల ఏఎండీ సంతోషంగా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లలో ఏఎండీ రైజెన్‌ 6000 సిరీస్‌ మొబైల్‌ ప్రాసెసర్లు ఉన్నాయి’’ అని వినయ్‌ షా, మేనేజింగ్‌ డైరెక్టర్‌ –సేల్స్‌ ఏఎండీ ఇండియా అన్నారు.

‘‘మేము దృష్టి సారించిన అతి పెద్ద అంశాలలో గేమిగ్‌ ఒకటి. గేమర్లు, ఔత్సాహికులు మరియు ప్రొఫెషనల్స్‌కు అత్యుత్తమ గేమింగ్‌ అనుభవాలను అందించడానికి ఏఎండీ కట్టుబడి ఉంది. 6ఎన్‌ఎం మాన్యుఫాక్చరింగ్‌ నోడ్‌తో నిర్మించిన ఈ ల్యాప్‌టాప్‌లలో రైజెన్‌ 6000 సిరీస్‌ ప్రాసెసర్లు ఉన్నాయి. అలాగే వీటిలో ఏఎండీ రాడియన్‌ గ్రాఫిక్స్‌ సైతం ఉన్నాయి. ఇది అత్యద్భుతమైన విజువల్స్‌, అత్యున్నత పనితీరు మరియు అధిక ఫ్రేమ్‌రేట్స్‌ను అందిస్తాయి’’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News