Saturday, January 18, 2025

మెచ్చా నాగేశ్వరరావు, జారే ఆదినారాయణ వర్గీయుల మధ్య ఘర్షణ

- Advertisement -
- Advertisement -

దమ్మపేటః అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కింపులో అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారే ఆదినారాయణ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలలో నిమఘ్నమైన వేళ దమ్మపేట మండల కేంద్రంలో మెచ్చా నాగేశ్వరరావు, జారే ఆదినారాయణ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దమ్మపేట మండల కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా వున్న చెరువు పరిసర ప్రాంతాల్లో ఇరు వర్గాలు మధ్య మాట మాట పెరిగి బాహాబాహీకి దిగారు. దీంతో ఇరు వర్గాలు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు ఎంత చెప్పినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టి, మరోసారి గొడవలు జరుగుతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News