- Advertisement -
అధికారుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందారు. వారం రోజుల క్రితం ఖమ్మ జిల్లా అశ్వరావుపేటలో ఎస్ఐ శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వెంటనే సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున ఎస్ఐ చికిత్స పొందతూ మృతి చెందారు.
ఆంధ్రాకు చెందిన నలుగురు కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, శివ నాగరాజు సహా సీఐ వేదింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు చనిపోయే ముందు ఎస్ఐ శ్రీనివాస్ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. ఎస్ఐ మృతిపై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -