Saturday, February 22, 2025

దేశాల మధ్య వివాదాలు.. విచ్ఛిన్నానికి దారితీయొద్దు : జైశంకర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఏ కోణంలో చూసినా ప్రపంచ రాజకీయ పరిస్థితి సంక్లిష్టం గానే ఉందని, రాబోయే కాలంలో కృత్రిమ మేథ, ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్షం, డ్రోన్లు , గ్రీన్ హైడ్రొజన్ వంటి అంశాల్లో భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం కచ్చితంగా ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సంఘర్షణ పరిస్థితులు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆహార భద్రత, కొవిడ్ మహమ్మారి సవాళ్లు, వాతావరణ ఆందోళనలను ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. జీ 20 మన ఆసక్తులు, సంస్కృతులు, దృక్పథాల వైవిధ్యాన్ని సంగ్రహిస్తుందన్నారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సమస్యలను ఎదుర్కోవడంలో , ప్రపంచ దేశాల ఎజెండాను ముందుకు తీసుకు వెళ్లడంలో జీ 20 కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సమాఖ్యను కాపాడుకోవడం ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యమని అన్నారు. ప్రపంచ దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారి విచ్ఛిన్నానికి దారి తీయకూడదన్నారు.
ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకం ..
పశ్చిమాసియా ఘర్షణలు, సముద్ర భద్రత, ఉక్రెయిన్ వివాదం, ఇండో పసిఫిక్ , యూఎన్ సంస్కరణలపై భారత దేశ వైఖరిని జైశంకర్ తెలిపారు. గాజా కాల్పుల విరమణ, బందీల విడుదలను దేశం స్వాగతిస్తోందని అన్నారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, మానవతా సహాయానికి మద్దతు ఇస్తుందని, పునరుద్ఘాటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఘర్షణలు నెలకొంటున్న ఆయా ప్రాంతాల్లో శాంతి, సుస్థిరత, నెలకొనడం ప్రపంచ దేశాలకు చాలా అవసరమని అన్నారు.

క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఒకదానికి ఒకటి సహాయ , సహకారాలు అందించుకోవాలని అంతర్జాతీయ చట్టం ప్రకారం కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రష్యాఉక్రెయిన్ వివాదంపై మాట్లాడుతూ యుద్ధం నివారించడానికి ఇరు దేశాల అధినేతలు చర్చలో పాల్గొనాలని భారత్ చాలాకాలంగా సూచిస్తోందని చెప్పారు. యుద్ధాన్ని భారత్ ప్రోత్సహించదని, దౌత్యాన్ని సమర్ధిస్తుందని పేర్కొన్నారు. ఈ సమస్యకు త్వరలో ముగింపు పలకాలని కోరుతున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News