Monday, January 27, 2025

రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం… హాజరైన సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

‘గవర్నర్ ప్రతిభా పురస్కారాలు- 2024’
అవార్డుల ప్రదానం
మనతెలంగాణ/హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్ హోం’ ఆదివారం సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, కన్హా శాంతివనం వ్యవస్థాపకులు కమలేష్ డి పటేల్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టిజిపిఎస్‌సి చైర్మన్ బుర్రా వెంకటేశం, పలువురు ఎంపీలు, ఎంఎల్‌ఎలు,ఉన్నతాధికారులతో పాటు పలువురు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరయ్యారు.

ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని ప్రముఖులను గవర్నర్ రాజ్‌భవన్‌కు ఆహ్వానించి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా, ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ‘గవర్నర్ ప్రతిభా పురస్కారాలు -2024’ కు ఎంపికైన పది మంది సభ్యులకు గవర్నరు జిష్ణుదేవ్ వర్మ అవార్డులు ప్రదానం చేశారు.

గవర్నర్ ప్రతిభా పురస్కారాలు- 2024 అవార్డులు ప్రదానం

ప్రత్యేక జీవితకాల సాఫల్య పురస్కారం:
1.డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి, ఐ.ఎఫ్.ఎస్(పర్యావరణ పరిరక్షణ)
వ్యక్తిగత విభాగం
2. దుశర్ల సత్యనారాయణ (పర్యావరణ పరిరక్షణ)
3. అరికపూడి రఘు (వికలాంగుల సంక్షేమం)
4. జీవన్‌జీ దీప్తి (ఆటలు, క్రీడలు)
5. పి.బి. కృష్ణ భారతి (సంస్కృతి)
6. ప్రొఫెసర్ యం. పాండు రంగారావు (సంస్కృతి)
సంస్థాగత విభాగం :
7. ధ్రువాంశ్ ఆర్గనైజేషన్ (పర్యావరణ పరిరక్షణ)
8. ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ (వికలాంగుల సంక్షేమం)
9. ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఆటలు, క్రీడలు)
10. సంస్కృతి ఫౌండేషన్ (సంస్కృతి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News